దాదాపుగా ఏడాది క్రితం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధానర్చకుడు రమణ దీక్షితులుకు టీటీడీ నోటీసులు జారీ చేసింది.. టీటీడీ పాలకమండలి అధికారులు, ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో ఆ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రమణ దీక్షితులుకు అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ ఆయన ఇంట్లో లేకపోవడంతో నోటీసులను అధికారులు ఇంటికి అంటించారు. అయితే టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై దీక్షితులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దుచేయడం ఆగమశాస్త్ర విరుద్ధమని తాను ఎన్నో అవమానాలను భరించాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. చాలా బాధపడ్డారు. టీటీడీ అధికారులు కొంతమంది అధికార బలంతో ఆలయ నిబంధనలను విస్మరిస్తున్నారని రాజకీయ ప్రముఖుల భజనచేస్తూ ఆలయ సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
రమణ దీక్షితులు విమర్శలు టీటీడీ అధికారుల్లో కలకలం రేపాయి. దీంతో దేవస్థానంలో అర్చకుల వయోపరిమితిపై ధర్మకర్తల మండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను విధులనుంచి తొలగించి ఉద్యోగవిరమణ వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో రమణ దీక్షితులుతోపాటు నలుగురు ప్రధానర్చకులు తమ పదవులను కోల్పోయారు. ఆయన ప్రధాన అర్చకులుగా ఉన్నప్పుడే ఆయన తిరుమలలో తీసుకుంటున్న నిర్ణయాలకు అభ్యంతరం చెప్పారు. తిరుమల లో జరిగిన త్రవ్వకాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆసమయంలో తిరుమలకు వచ్చిన బిజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు స్వాగతం పలికి, అక్రమంగా త్రవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆప్రదేశం చూపించారు. దీంతో ఆయన్ను తొలిగించారు. రమణ దీక్షితుల తొలిగింపు వ్యవహారాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అనంతరం పులివెందులకు వచ్చి జగన్‌తో సమావేశమై తిరుమల పరిస్థితులను దీక్షితులు జగన్ కు వివరించారు.
జగన్ పులివెందులలో ప్రజా దర్బార్‌లో సమావేశమైన సమయంలో వచ్చిన ఆయనకు జగన్ స్వాగతం పలికారు. ఆయన జగన్‌కు ఆశీస్సులు అందించారు. అయితే జగన్ చెప్తున్నట్టుగా దేవుడి స్క్రిప్ట్ ప్రకారమో, యాధృచ్చికమో తెలియదు కానీ చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇచ్చారు. కృష్ణానది కరకట్టపైన ఆయన ఇంటిగోడకు నోటీసులు అంటించారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఎందుకు కరకట్టపై కట్టారనేది కూడా వెల్లడించాలని కోరారు. ఇంట్లో స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, 10 టెంపరరీ షెడ్లు కూడా అక్రమంగా నిర్మించారని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారికి సేవచేసిన దీక్షితుల కంట కన్నీరు చూసిన చంద్రబాబుకు ఆయన ఏవిధంగా అయితే ఇంటికి నోటీసులిచ్చారో ఇప్పుడు అదే చంద్రబాబు ఇంటి మీదకు వచ్చేసరికి గగ్గోలు పెడుతుండడం, అది కూడా అక్రమ కట్టడం కావడంతో ప్రజలు దేవుడున్నాడని అన్ని లెక్కలు సరిచేస్తున్నాడంటూ చెప్పుకుంటున్నారు.