ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు అందరు బిత్తరపోతున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసిన జగన్ జగన్ అనే మాటే వినిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటి నుండి నేటి వరకు తాను చేసిన పనులు,ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండడం వాటికోసమే ముందుకు వెళ్ళడం ఇలా ప్రతీపని తానే ముందుండి నడిపిస్తున్నారు.అయితే ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రజల మధ్యలోకి వెళ్లి వాళ్ళ సమస్యలను పూర్తిగా తెలుసుకున్నాడు.దాని ఫలితమే ఈరోజు జగన్ ను ప్రజలు అజేయంగా గెలిపించారు.
దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి రాజకీయ నేతలెవరైనా గెలిచినా, ఓడినా ప్రజల మధ్యన ఉండాలనుకుంటారు కాని చంద్రబాబు మాత్రం కాలు బయట పెట్టడానికి జంకుతున్నారు. ప్రజలిచ్చిన దిమ్మతిరిగే షాక్ నుంచి తేరుకోలేదో, లేక వాళ్ల మీద అలిగారేమో అని ప్రశ్నించాడు.ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబుకు లింగమనేని ఎస్టేట్ ఉంటుందో పోతుందో అన్న కొత్త టెన్షన్ మొదలైనట్లుంది అని అన్నారు.కాని వైసీపీ నేత ప్రస్తుత ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ మాత్రం పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి గడప గడపకు కాలి నడకన వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.అందుకే ఆయను ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారని అన్నారు.
రాజకీయ నేతలెవరైనా గెలిచినా, ఓడినా ప్రజల మధ్యన ఉండాలనుకుంటారు. చంద్రబాబు మాత్రం కాలు బయట పెట్టడానికి జంకుతున్నారు. ప్రజలిచ్చిన దిమ్మతిరిగే షాక్ నుంచి తేరుకోలేదో, లేక వాళ్ల మీద అలిగారో? లింగమనేని ఎస్టేట్ ఉంటుందో పోతుందో అన్న కొత్త టెన్షన్ మొదలైనట్లుంది ఆయనకు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 1, 2019