ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ పై కేసు నమోదైంది. అమీషా పటేల్ తనకిచ్చిన రూ.3 కోట్ల చెక్ బౌన్స్ అయిందని నిర్మాత అజయ్ కుమార్ సింగ్ రాంఛీ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ‘దేశీ మ్యాజిక్’ సినిమా నిర్మాణం కోసం అమీషా పటేల్ రూ.2.5 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత అమీషా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. గతేడాది సినిమా కోసం నా దగ్గరి నుంచి తీసుకున్న డబ్బు విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నా ఫిర్యాదు మేరకు రాంఛీ కోర్టు అమీషా పటేల్ కు సమన్లు జారీచేసింది. జులై 8న కోర్టు ఎదుట ఆమె హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ అమీషా పటేల్ రాకపోతే ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీచేస్తామని అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
అమీషా పటేల్ జూన్ 17న కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా రాలేదు. 2013లో అమీషాపటేల్, ఈషా గుప్తా, జాయెద్ ఖాన్, సాహిల్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దేశీ మ్యాజిక్ ప్రారంభమైనప్పటికీ..ఆ తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ బయటికి రాలేదు.