వైసీపీ అదినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నివాసం వద్ద జూలై 1 నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహించనున్నారు. అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని, వాటి సత్వర పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టిసారించనున్నారు. ఇందులో భాగంగా రోజూ గంట సేపు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, చిరుద్యోగులు, నిరుద్యోగులు, తమ సమస్యలను తెలియచేసేందుకు సీఎం నివాసానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి నేరుగా వినతులు స్వీకరించే ఏర్పాటు లేకపోవడంతో అధికారులే వినతులు స్వీకరిస్తున్నారు. చాలా మంది సీఎంను కలిసి వినతులు ఇవ్వడం ద్వారా తమ సమస్యకు మెరుగైన పరిష్కారం కలుగుతుందని, ఆ మేరకు కలిసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో రోజూ ప్రజాదర్బార్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తొలుత ప్రతి రోజు అరగంట మాత్రమే వినతులు స్వీకరించేందుకు ప్రతిపాదించినా, ఎక్కువ సంఖ్యలో వస్తున్న ప్రజలను చూసి రోజుకు గంట పాటు వినతులు స్వీకరించాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రజల సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి తెలుసుకుంటారు. వినతులు కూడా స్వీకరిస్తారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడంతో క్యాంపు కార్యాలయం వద్ద ఒక వైపు షెడ్‌ను నిర్మించారు. ప్రజలు అక్కడ వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
See Also : ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
See Also : సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్
See Also : పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత
See Also : విజయ్ దేవరకొండకు మరో లవ్ స్టొరీ..ఎవరో తెలుసా?
See Also : సీఎం జగన్ కు చేరేంతవరకూ షేర్ చేయండి..ప్రపంచ కప్ పోటీల్లో కర్నూల్ యువకుడు ఘన విజయం