తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో అటవీశాఖ అధికారిణి అనితపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాడి ఘటనపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని కేటీఆర్ స్పష్టం చేశారు. కోనేరు కృష్ణపై కేసు నమోదయిందని.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
I strongly condemn the atrocious behaviour of Koneru Krishna who attacked a forest officer who was doing her job. He has been arrested & a case booked already; no one is above law of the land
— KTR (@KTRTRS) June 30, 2019