ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత రెండు రోజులకు అది వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. రుతుపవనాలు మొదలయ్యాక అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మరింత ఆశాజనకంగా ఉంటుం దని వ్యవసాయ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొమురం భీం జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. సారంగాపూర్, బజర్హతనూర్‌ల్లో 7 సెం.మీ., దిల్‌వార్‌పూర్, వంకడి, ఖానాపూర్‌ల్లో 6 సెం.మీ., కమ్మర్‌పల్లి, ఆర్మూర్, నందిపేట, భూపాలపల్లి, మోర్తాడ్, బోథ్, మంథని, నవీపేట్‌ల్లో 5 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది.
See Also : ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
See Also : సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్
See Also : పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత
See Also : విజయ్ దేవరకొండకు మరో లవ్ స్టొరీ..ఎవరో తెలుసా?
See Also : సీఎం జగన్ కు చేరేంతవరకూ షేర్ చేయండి..ప్రపంచ కప్ పోటీల్లో కర్నూల్ యువకుడు ఘన విజయం