బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందని చెప్పాలి.అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ క్రికెటర్స్ పై కూడా పడింది.వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రావో తో నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ఒక తెలుగు సినిమా తీయనున్నాడు.ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలియజేసాడు.ఓ బేబీ, సైలెన్స్, వెంకీమామ,ఇలా చాలా ప్రాజెక్ట్ లు సక్సెస్ చేసిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఈ క్రికెటర్ తో సినిమా తీయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇంక అసలు విషయానికి వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఒక షార్ట్ ఫిలిమ్ తీయనుంది.ఇది తమిళనాడు మరియు వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్, టోబాగోలో లో షూటింగ్ తీయనున్నారు.మిగతా విషయాలు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.