ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పదిహేడు ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేరుస్తూ యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్యప్,మల్లా,కుమ్మర,రాజ్ భర,ప్రజాపతి తదితర 17ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలోకి చేరుస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. దీంతో ఇక నుంచి ఈ కులాల వారికి ఎస్సీ కేటగిరీ కింద సర్టిఫికెట్లు జారీచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం..
