భారతదేశ ప్రభుత్వ నిబంధనలను పాటించడం దేశంలోని ప్రజలందరి కర్తవ్యం, అంతకు మించి బాధ్యత.. అయితే పాలకులే వాటిని బేఖాతరు చేస్తున్న ఘటనలు చూసాం.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నదీ పరివాహక ప్రాంతంలోని ఇంట్లో ఉంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలతోపాటు కనీస నియమాలను తుంగలో తొక్కారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే నిబంధనలకు తిలోదకాలిస్తే సామాన్యులు ఎలా నిబంధనలు పాటిస్తారు అనేది మినిమమ్ క్వశ్చన్.. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను సహించే ప్రసక్తే లేదని, ఈ నిర్ణయాన్ని ప్రజల్లోకి అధికారుల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లేందుకే ప్రజావేదికలో సమావేశం పెట్టారు. మనం దీన్ని కూలుస్తున్నాం అనగానే అక్కడి అధికారులు, కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేసారు. ఇలా అక్రమంగా కట్టినవాటికి పెనాల్టీలు వేస్తూనో లేక అధికారులకు లంచాలు ఇస్తూనో కాలంగడిపేయొచ్చు.. కానీ అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించడం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు.
ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక వర్గ.. ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు వారందరి సమక్షంలోనే జగన్ నిర్ణయాన్ని ప్రకటించారు. రాజధాని ప్రాంతంలోని అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర పర్యావరణశాఖ చెప్పినా అహంకారంతో ప్రజావేదిక అక్రమంగా కట్టడం అధి అక్రమమనే దృఢమైన సందేశంతో వాటిని కూల్చడం వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ తెగువను మెచ్చుకోవాలి. అది అక్రమమే అయినా ప్రతీ అక్రమాన్ని తేలిగ్గా తీసుకోవడం తద్వారా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తాను లేను అనే సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన రెడ్డి తీసుకున్న అత్యంత వివాదాస్పద మొదటి నిర్ణయానికి టీడీపీ ఇలా అయిపోతే ఎలా అనేది జగన్ నుంచి ఇలాంటి ఎక్సపర్టేషన్స్ తో ఉన్నవారిమాట.. కానీ గడిచిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశం చూసిన ప్రజలకు మాత్రం కచ్చితంగా పట్టుదల గల సీఎం సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉండదని చెప్తున్నారు.
ప్రభుత్వం తలచుకుంటే మంచి పనులుచేసి, మంచి నిర్ణయాలు తీసుకుని, మంచి మార్పులు తేవచ్చనేది జగన్ చేసి చూపిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి కావలసిన స్థైర్యాన్ని పరిపాలనలో జోడించి చూపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో చాలామంది మాత్రం ఒక్కటే అడుగుతున్నారు.. మేం ఏదైనా చిన్న తప్పు చేసినా, ఒక అడుగు ముందుకో వెనుకకో కట్టినా వచ్చి నోటీసులిచ్చి జరిమానాలు వేసిన వ్యక్తి అక్రమంగా తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయమంటే, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అవినీతి చేసి కేవలం పదిశాతం డబ్బుతో కట్టిన ప్రజావేదిక కూల్చుతామంటే ఎందుకు వణుకు పుడుతుంతని ప్రశ్నిస్తున్నారు.