విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన ఆర్జున్ రెడ్డి సంచలనమైన హిట్ సాధించిన సంగతి విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో మొదటి సినిమానే బంపర్హిట్ సాధించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాకు జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు వచ్చింది. దీంతో సందీప్ రెడ్డి ఆర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కించిన కబీర్ సింగ్ తో బాలీవుడ్కు పరిచయమయ్యాడు. అయితే ఈ మూవీ హిట్ కాకపోయిన కానీ నూట యాబై కోట్ల రూపాయలను వసూళ్లను సాధించింది. ఈ సంవత్సరం విడుదలైన మూవీలల్లో నూట యాబై కోట్ల కలెక్షన్లను సాధించిన టాప్ 3 గ్రాసర్స్‌లో నిలుస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు.దీంతో సందీప్ రెడ్డికి ఒక ఆఫర్ వచ్చింది అని సమాచారం .అందులో భాగంగా కబీర్ సింగ్ విజయం గురించి తెల్సుకున్న కండలవీరుడు సూపర్ హీరో సల్మాన్ ఖాన్, సందీప్‌తో సినిమా చేసేందుకు ఒకే అని చెప్పాడని సమాచారం.. దిన్ని టీ సిరీస్ సంస్థ నిర్మించేందుకు రెడీ అవుతున్నట్టుగా టాక్.
