తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం పరిధిలోని మల్కాజ్ గిరి నుండి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తెలంగాణలో మూడు స్థానాలను గెలుచుకున్న కానీ దేశ వ్యాప్తంగా మాత్రం ఆ పార్టీఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే పలువురు నేతలు కూడా నడుస్తూ పార్టీ అధ్యక్ష కార్యదర్శి పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనుముల రేవంత్ రెడ్డి ఆ పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా పార్టీ పదవీకి రాజీనామా చేశారు.
