ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తాను తీసుకున్న సంచలన నిర్ణయాలకు ప్రజలందరి చేత వహ్వా అనిపించుకుంటున్నారు.ఇదే ముఖ్యమంత్రి పదవిలో గత ఐదేళ్ళు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేటు తిప్పేసాడు.అందుకే ఈసారి ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారు.కాని జగన్ మాత్రం ఇచ్చిన మాటకోసం కట్టుబడి ఉన్నారు,ఈమేరకు కసరత్తులు కూడా చేస్తున్నారు.చంద్రబాబు ఇచ్చిన హామీలు చేయనప్పటికీ అనవసర పనులకి ఎక్కువ డబ్బులు తగలేసారని చెప్పాలి. దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చాడు.విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారు ఆయన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవని దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం మొదటిసారి వింటున్నాం అని ఆయన అన్నారు.
విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం మొదటిసారి వింటున్నాం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 29, 2019