తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి విదితమే.ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలు,జలవివాదాలు,విభజన చట్టంలోని హామీలపై,పంపకాలపై తదితర అంశాల గురించి సుధీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు,అధికారులు అందరూ హాజరయ్యారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన జోకుకు సమావేశంలో ఉన్న అంతా దాదాపు పదినిమిషాల పాటు సరదగా నవ్వుకున్నారు.
చాలా సుధీర్ఘ సమయం పాటు సాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు జోకులు వేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు రకాల సమస్యలపై చర్చించేందుకు మళ్లీ ఎప్పుడు భేటీ అవుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఎస్కే జోషిని అడిగారు.దీనికి ఎస్కే జోషి సమాధానమిస్తూ”వీళ్ళు (నవ్యాంధ్ర అధికారులు)ఇక్కడ నుంచి వెళ్లితే మళ్లీ దొరకరు.
ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై చర్చించడానికి వెంటనే భేటీ అవుతాం. రాత్రి ఏ సమయం అయిన సరే అవసరమైతే మర్నాడు కూడా కూర్చుంటామని”అన్నారు. ఈ చర్చలు జరిగే వరకు వాళ్లకు ఏపీకి పంపించేదే లేదని జోషి సరదాగా అన్నారు. ఓర్నీ ఆంధ్రోళ్లను అరెస్టు చేస్తారా ..?ఏంది ..?అని సీఎం కేసీఆర్ నవ్వుతూ ప్రశ్నించగా అరెస్టు చేయడమే అని జోషి సమాధానమివ్వడంతో అక్కడున్నవారు అంతా నవ్వుకున్నారు. ఇది అంత గమనిస్తున్న నవ్యాంధ్ర సీఎం జగన్ మంచి జరుగుతుందంటే అరెస్టు చేసిన పర్వాలేదు”అని ఆయన కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు.