ఏపీ యువముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే. అంగన్ వాడీలకు జీతాలు పెంపు దగ్గర నుండి సర్కారు విద్య వైద్యం బలోపేతం వరకు ఎన్నో మరెన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని అందరి చేత వహ్వా అనిపించుకుంటున్నారు.
తాజాగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత గురించి ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం ఒక కోటీ డెబ్బై లక్షల మంది నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు కేవలం ఆరు లక్షల మందికే నిరుద్యోగ భృతి ఇచ్చింది. ప్రస్తుతం జగన్ తీసుకున్న నిర్ణయంతో అంతే కాదు భృతి 3 వేల తో పాటు గ్రామ వాలంటీర్ గా మరో 5 వేలు కలిపి 8 వేలు వచ్చే అవకాశం కల్పించారు.
గతంలో ఉద్యోగం వస్తే భృతి పోతుంది ఇప్పుడు ఆలా కాకుండా పాత విధానానికి స్వస్తి పలకాలి అని నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఉన్న యువనేస్తాం వెబ్ సైట్ కూడా తొలగించాలి అని నిర్ణయం తీసుకున్నారు.త్వరలోనే రాజన్న భృతి పేరుతో వెబ్ సైట్ ప్రారంభించనున్నారు.అందులో ప్రతి నెల భృతి ఇచ్చిన వారి వివరాలు ఉంచనున్నారు.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేతగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా తాజాగా ముఖ్యమంత్రిగా ఆ హామీని నెరవేర్చారు. దీంతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులతో పాటుగా ప్రజలు జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.