ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019, డిసెంబర్ నాటికి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 13వేల 59 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు హోం మినిస్టర్ మేకతోటి సుచరిత. ఈ రిక్రూట్ మెంట్ తో పోలీస్ శాఖ మరింతగా బలపడుతుందన్నారు. 4 బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు సుచరిత. వీటిలో ఒక మహిళా బెటాలియన్, గిరిజన్ బెటాలియన్లు ఉంటాయని సంచలన ప్రకటన చేశారు. ఈ నాలుగు బెటాలియన్లలో 4వేల ఉద్యోగాల భర్తీ ఉంటుందని.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పారదర్శకత, నిష్పక్షపాతం, కచ్చితమైన పరిశోధనతో బాధితులకు త్వరగా న్యాయం చేయటమే ప్రభుత్వం లక్ష్యం అని హోంమంత్రి సుచరిత ప్రకటించారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం, గౌరవం ఏర్పడేలా ప్రవర్తన ఉండాలని పోలీసులకు సూచించారు. రౌడీ షీటర్లు, నేరస్తులకు కౌన్సెలింగ్ ద్వారా మార్పు తీసుకురావాలని కూడా సూచించారు.
