పాకిస్తాన్,ఇండియా ఈ జట్లు ఆటలోనే కాదు బయట కూడా ఇప్పుడు కలిసి ఉండవు.అంత బద్ధ శత్రువులు అని చెప్పాలి అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్ లు ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇండియా,ఇంగ్లాండ్ మధ్య రసవత్తర పోరు జరగనుంది.ఈ మ్యాచ్ తో చాలా జట్టుల భవిష్యత్తు కూడా ముడిపడి ఉందని చెప్పాలి.ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ కు క్వాలిఫై అయిన విషయం అందరికి తెలిసిందే.నెక్స్ట్ రేస్ లో న్యూజిలాండ్ ,ఇండియా ఉన్నారు.ఇంగ్లాండ్ 8పాయింట్స్ తో నాలుగో స్థానంలో ఉంది.వాళ్ళు ఆడబోయే చివరి రెండు మ్యాచ్ లు గెలిస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు.అలా కాని యెడల ఆ ఛాన్స్ పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కు వస్తుంది.ఈ రెండు జట్లు చారో 7పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఈ నేపధ్యంలో ఎలాగైనా రేపు జరిగే మ్యాచ్ లో ఇండియా గెలవాలని ఆ రెండు జట్లు మరియు అభిమానులు కోరుకుంటున్నారు.
