ప్రపంచకప్ లో భాగంగా మొన్న మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్,ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి కోహ్లి బ్యాటింగ్ ఎంచ్చుకున్నాడు. అయితే బ్యాటింగ్ కి వచ్చిన ఓపెనర్స్ రోహిత్ శర్మ,రాహుల్ కాసేపు క్రీజ్ లో ఉన్నపటికి,కాసేపటికి రోచ్ బౌలింగ్ లో రోహిత్ బంతి ఇన్‌స్వింగై బ్యాట్, ప్యాడ్‌కు మధ్యలో నుంచి వెళ్లి వికెట్ కీపర్ చేతిలో పడింది.అయితే బౌలర్ అపిల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో విండీస్ రివ్యూ తీసుకున్నారు.ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్‌గా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ గఫ్ ఫీల్డ్ వ్యవరించగా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టి సరిగ్గా చూడకుండా అవుట్ ఇచ్చేసాడు.దీంతో యావత్ భారత్ క్రికెట్ అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.ఒకడు అయితే అతడిపై కోపం తో ఆ అంపైర్ యొక్క వికీపీడియా ను మార్చేశాడు.ఎలాగైనా తన సొంత జట్టు ఐన ఇంగ్లాంగ్ సెమీస్ కు వెళ్ళాలని కావాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అతడు రాసాడు.