భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. శుక్రవారం విద్యా సంస్థ 52వ స్నాతకోత్సవంలో… గోపీకి ఇస్రో పూర్వ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కె.రాధాకృష్ణన్ రజత ఫలకం అందివ్వగా, ఐఐటీ డైరెక్టర్ ప్రొ. అభయ్ కరన్‌దికర్ డాక్టరేట్ ధ్రువపత్రాన్ని ప్రదానం చేశారు.
