దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల గురించి సుధీర్ఘంగా చర్చించారు.
ఈక్రమంలో కృష్ణ గోదావరి నీళ్లను ఏవిధంగా వినియోగించుకోవాలి.. ఇరు రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకు ఎలా సాగునీరు అందించాలని ఇలా పలు అంశాల గురించి ఈ భేటీలో చర్చించడం జరిగింది.అయితే ఈ భేటీలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటకు ముఖ్యమంత్రి జగన్ ఫిదా అయ్యారు అంట. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ”భేషజాలు లేవు. అపోహాలు లేవు.
వివాదాలు లేవు.
వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా సాగునీళ్ళు కాదు కదా త్రాగునీరు కూడా ఇవ్వలేం. కేసీఆర్,జగన్ వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజలకోసమే.. ప్రజాహితం కోసమే ఆలోచిస్తరు. ప్రజలు నమ్మి మనకు ఓట్లెసి గెలిపించారు. మనం వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలని “అన్నారు. సీఎం కేసీఆర్ అన్న ఈ మాటలకు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఫిదా అయ్యారు. దీనికి సమాధానంగా సీఎం జగన్ తక్కువఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం.ఇరు రాష్ట్రాల మధ్య సహృదయభావనను కలిగి స్నేహాపూర్వక వాతావరణంలో ముందుకు పోదామని ఆయన అన్నారు .