ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఒకప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే 100మార్కుల పేపర్ ఉండేది.కాని ఇప్పుడు అది కాస్తా 80మార్కులకు కుదించారు.మిగతా 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ,అవి క్లాస్ టీచర్స్ నే వేస్తారు.ఇలా చేయడం వల్ల గత ఏడాది పదో తరగతిలో పది జీపీఏ అత్యధిక శాతం రావడంతో అవి చాలా విమర్శలకు దారితీసింది.దీంతో అప్పుడే ఈ సిస్టమ్ తొలిగించాలని చాలా ప్రతిపాదనలు కూడా రావడం జరిగింది.అయిన సరే అది పట్టించుకోకుండా యదావిదిగా పరిక్షలు నిర్వహించారు.ఈసారి అలాంటిది జరగకుండా తాజాగా విద్యా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు.ఈ విద్యా సంవత్సరం నుండి టెన్త్ పేపర్ 100మార్కులు ఉంటుంది.
