గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయం అయిన టీడీపీ పార్టీ తన చరిత్రలోని అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఓవైపు తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా…ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ.. అదే దుస్థితి ఎదురయ్యేలా ఉంది. ఏపీలో టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో… ఏకంగా 16 మంది టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే కాని జరిగితే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. అయితే బిజెపి ప్రయత్నాలు పసిగట్టిన చంద్రబాబు.. తెలుగుదేశం ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ మారవద్దని ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారంట.. పార్టీ మారకుండా ఉంటే ఒక్కో ఎమ్మెల్యేకు పది కోట్ల రూపాయల వరకు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడు టీడీపీలోకి వస్తే 10 కోట్లు..ఇప్పుడు టీడీపీని వీడకుండ ఉండేందుకు 10 కోట్లు ఆఫర్ వచ్చిందంట అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. మరి టిడిపి ఎమ్మెల్యేలు ఈ 10 కోట్ల బంపర్ ఆఫర్ కు లొంగుతారా ? లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పంచన చేరితే అంతకంటే ఎక్కువ లాభం ఉంటుందని ఆలోచిస్తారా..అనేది చూడాలి
