టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న అద్దె ఇంటికి CRDA అదికారులు నోటీసుల అంటించడం కక్ష సాదింపు చర్య అని మాజీ మంత్రి యనమల రామకృస్ణుడు ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృస్ణారెడ్డి కోర్టులో కేసులు వేశారని, అవి పెండింగులో ఉండగా, నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.పంచాయతీ నుంచి ఈ భవనానికి అనుమతి తీసుకున్నారని ,అది 2008 లో జరిగిందని, నదీ సంరక్షణ చట్టం 2012 లో వచ్చిందని ఆయన అన్నారు. CRDA పరిదిలో ఈ భవనం లేదని ఆయన అంటున్నారు. అయితే CRDA నోటీసులో పది తాత్కాలిక్ షెడ్ లు, స్విమ్మింగ్ పూల్, హెలిపాడ్ వంటి పలు నిర్మాణాలు ఉన్నట్లు ,వాటిపై కూడా సంజాయిషీ ఇవ్వాలని కోరారు..యనమల చెబుతున్నట్లు కోర్టులో పెండింగులో ఉంది కనుక నోటీసులు ఇవ్వరాదా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
