అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతు బుధవారం తుదిశ్వాస విడిచారు.అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నటుడు కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం కృష్ణ ,నరేష్ మరియు కుటుంభ సభ్యులను పరామర్శించారు. తన భార్య మరణంతో విలపిస్తున్న కృష్ణను జగన్ ఓదార్చారు.జగన్ తో పాటుగా వైసీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి. విజయసాయిరెడ్డి వచ్చారు.
