రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ, వివిధ సంస్థలకు చైర్పర్సన్ల నియామకం కొనసాగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మిని ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా, వాటర్‌షెడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఎస్.రమణారెడ్డిని రాష్ట్ర కొత్త, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీగా, కళాశాల విద్య స్పెషల్ కమిషనర్ సుజాత శర్మకు సాంకేతిక విద్య స్పెషల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా జేఎన్టీయూ (అనంతపురం)లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డిని నియమించారు. వి.విజయరామ రాజును ఏపీ మార్క్‌ఫెడ్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఎండీగా నియమించారు.
