ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరో ,సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ప్రముఖ దర్శక నిర్మాత నటి అయిన విజయనిర్మల అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే. విజయనిర్మల మృతితో కృష్ణకుటుంబ సభ్యులతో పాటు సూపర్ స్టార్ అభిమానులు,టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది.
ఈ నేపథ్యంలో ఒకవైపు హీరోయిన్ నటిస్తూనే మరోవైపు దాదాపు నలబై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు ఆమె. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మొన్న బుధవారం ఆమె మృతిచెందారు. గతంలో ఒక ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో విజయనిర్మల తనకు చివరికోరిక ఏంటో వివరించారు.
ఆమె ఆ ఛానెల్లో మాట్లాడుతూ” నేను దేవదాసు సినిమా తర్వాత సినిమాలను తీయకూడదు అనుకున్నాను. కానీ సినిమా ఇండస్ట్రీలో జయపజయాలు పట్టించుకోకుండా సినిమాలు తీయాలని కృష్ణ గారు సూచించారు. దీంతో ఆ స్ఫూర్తితో ఇప్పటివరకు నలబై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాను .. ఇంకో ఆరు సినిమాలకు దర్శకత్వం వహిస్తే యాబై సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా చరిత్ర సృష్టిస్తాను”అని ఆమె అన్నారు. అయితే ఆమె తన చివరికోరిక తీరకుండానే తనువు చాలించారు అని ఇటు అభిమానులు,అటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను గుర్తుచేసుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు