ప్రతి రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులును లన వైపు తిప్పుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈటీవీలో ప్రసారమయ్యో ‘పటాస్’ షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈషోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద హిట్ . అయితే అంతాలా పేరు తెచ్చిన ‘పటాస్’ షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకొవాలని భావిస్తోంది శ్రీముఖి. తన అందం, అల్లరితో షోను పరుగులు తీయించడమే కాదు, తన గ్లామర్‌తో కొత్త అందాన్ని తీసుకొచ్చింది ఆ షోకి. అలాంటీ శ్రీముఖి షోలో లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆసక్తిగా మారింది. అయితే ఎందుకు శ్రీముఖి విరామం తీసుకుంటుందో ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. శ్రీముఖి మాత్రం ‘పటాస్’ షో ప్రొడ్యూసర్స్ అనుమతితోనే బ్రేక్ తీసుకుంటున్నన్నట్టు తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. దీనికి కారణం బిగ్ బాస్ 3 లోకి శ్రీముఖి ఎంటర్ అవుతన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమె పటాస్’ షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకొవాలని అనుకుందంట. ఇక ఇది కాని నిజమైతే బిగ్ బాస్ 3 లో శ్రీముఖితో రచ్చ రచ్చే అంటున్నారు అభిమానులు
