వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత వేస్తున్న ప్రతీ అడుగుకు చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి.జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు టీడీపీ సీనియర్ నాయకులు సైతం బిత్తరపోతున్నారు.జగన్ వ్యూహాలకు ఒక్కొక్కడి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి టీడీపీ దిగాజారిపోతుండడంతో చంద్రబాబు పరిస్థితులను చక్కదిద్దడానికి రంగంలోకి దిగాడు.ఈ మేరకు ఉదయం 10గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో అసంతృప్తి ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టనున్నారు.ఈ మీటింగ్ ముఖ్యంగా చంద్రబాబు కాపుల కోసమే పెట్టారు.తూర్పుగోదావరి జిల్లా కాపు నేతలు అంతా కలిసి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,నెంబర్ 2 గా చెప్పుకుంటున్న మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ మీటింగ్ లో ముఖ్యంగా చంద్రబాబుకు అతడిపై పిర్యాదు చేయనున్నారని తెలుస్తుంది.ఆయనను పార్టీ నుండి తొలిగిస్తే ఇందులో కొనసాగడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పనున్నారు.ఒకవేళ అలా జరగని యెడల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా చెప్పినట్టు సమాచారం.మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు ఎలాంటి అడుగు వేయనున్నాడని అందరు ఎదుర్చుస్తున్నారు.ఒకపక్క వైసీపీ మరోపక్క బీజీపీ చంద్రబాబుకు తలనొప్పిగా మారిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేల నైన బుజ్జగించే ప్రయత్నం బాబు చేయగలడా అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న..?అలా చెయ్యని యెడల టీడీపీ భూస్థాపితం అయినట్లేనని అందరు అనుకుంటున్నారు.