ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోయింది అంటే ఆ పార్టీ పరిస్థితి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇది ఇలా ఉండగా జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాతనుండి ఇప్పటివరకూ అందించిన పాలనకు ప్రజలు ఫిదా అయిపోయారనే చెప్పాలి.జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్నాడు.ఇక అసలు విషయానికి వస్తే గడిచిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 23అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకుని చెత్త రికార్డు సొంతం చేసుకుంది.ఈ 23మంది ఎమ్మెల్యేలతో బాబు ఏమ్ చేయగలడు అనేది పక్కన పెడితే ప్రస్తుతం టీడీపీ పార్టీలో ఓడిన ఎమ్మెల్యేలు,ఎంపీలు గురించి చంద్రబాబుకి ఏమీ చెయ్యాలో అర్ధంకావడంలేదట.
ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు బీజీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.అయితే వీరి చేరికను చంద్రబాబు లైట్ తీసుకున్నాడనే చెప్పాలి.ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే చంద్రబాబు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంటే.ఇప్పటికే వైసీపీ,బీజీపీ పార్టీలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి.దీంతో చంద్రబాబు ఈరోజు ఉండవల్లిలో ఉన్న తన నివాసంలో ఉదయం 10తరువాత మీటింగ్ పెట్టనున్నారు.ఈ మీటింగ్ ముఖ్యంగా కాపులకే కావడం మరికొన్ని అనుమానాలకి దారి తీస్తుంది.ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలను బాబుగారు ఎలా బుజ్జగిస్తారు అనేది వేచి చూడాల్సిందే.జగన్ దెబ్బకు ఇప్పటికే మైండ్ బ్లాక్ అయిన చంద్రబాబు వీళ్ళతో ఈ ఐదేళ్ళు పార్టీని నడపడం అంటే బాబుకి కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి.