ఆంధ్రప్రదేశ్ లో పచ్చ మీడియా సోది తగ్గింది అనుకుంటే అది మళ్ళీ మొదలైంది.మొన్న జరిగిన ఎన్నికల వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమ్ చేసిన,అది తప్పు ఐన సరే ఆ మీడియా ఒప్పుగానే చూపించేది.అయితే ఎన్నికల ఫలితాల రూపంలో జగన్ చంద్రబాబుకు అనుకూల మీడియాకు గట్టి సమాదానం చెప్పాడు.దీంతో ఒక్కసారిగా పచ్చ బ్యాచ్ సైలెంట్ అయ్యింది.ఇప్పుడు మల్లా బాబుకే పల్లకి సేవ చేస్తుంది.దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సరైన కౌంటర్ ఇచ్చాడు.అనుకూల మీడియా మళ్లీ చంద్రబాబు పల్లకి సేవ మొదలు పెట్టిందని, నదీ పరిరక్షణ చట్టం-1884, ఎన్జీటీ, సీఆర్డీఏ నిబంధనలు నదిని పూడ్చి నిర్మించిన కట్టడాలు అక్రమమని ఘోషిస్తున్నాయి అన్నారు.మీడియా కూడా ఈ చట్టాలు చదివితే మంచిదని ఆయన అన్నారు. బాబు నిర్మించాడు కాబట్టి కుల మీడియాకు అవి చారిత్రక కట్టడాల్లా కనిపిస్తున్నాయేమో అని ఎద్దేవా చేసారు.
అనుకూల మీడియా మళ్లీ చంద్రబాబు పల్లకి సేవ మొదలు పెట్టింది. నదీ పరిరక్షణ చట్టం-1884, ఎన్జీటీ, సీఆర్డీఏ నిబంధనలు నదిని పూడ్చి నిర్మించిన కట్టడాలు అక్రమమని ఘోషిస్తున్నాయి. మీడియా కూడా ఈ చట్టాలు చదవాలి. బాబు నిర్మించాడు కాబట్టి కుల మీడియాకు అవి చారిత్రక కట్టడాల్లా కనిపిస్తున్నాయేమో.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 28, 2019