ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో ఒక వైపు బుజ్జగింపులు ,మరో వైపు ఒక వేళ సంబందిత నేత పార్టీని వీడితో ఎవరు ప్రత్యామ్నాయం అన్న ఎంక్వైరీ లు జరుగుతండడం పెద్ద చర్చగా మారింది. అంతేకాక అది కొత్త సమస్యలకు దారి తీసింది. కాపునేతల సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కాపు నేతల సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత తాను పార్టీ వీడడం లేదని ప్రకటించారు. అయినా పార్టీ ఆఫీస్ నుంచి కార్పొరేటర్లు,ఇతర నేతలకు పోన్ వెళ్లాయట. బొండా ఉమా పార్టీ మారితే ఎవరు ప్రత్యామ్నాయ నేత అని అడిగారట.ఈ విషయం తెలిసిన ఉమా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.ఉమా అసంతృప్తిగా ఉన్నారని తెలిసిన పార్టీ అదినేత చంద్రబాబు ఆయనకు పోన్ చేసి బుజ్జగించారట. నియోజక వర్గంలోని కార్పొరేటర్లకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను చంద్రబాబు దృష్టికి ఉమ తీసుకెళ్లారు. ఇలా చేస్తే తన ఇమేజ్‌తోపాటు పార్టీ కూడా దెబ్బతింటుందని, తన నాయకత్వాన్ని ఎవ్వరూ విశ్వసించరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అటువంటి కాల్స్ పార్టీ కార్యాలయం నుంచి వస్తే ఎవర్నీ ఉపేక్షించ బోనని, అన్ని విషయాలు తెలుసుకుని కఠినచర్యలు తీసుకుంటానని ఉమాకు హామీ ఇచ్చారట. జూలై ఒకటిన కాపు నేతల సమావేశం ఏర్పాటు చేస్తామని, దానికి అంతా రావాలని చంద్రబాబు కోరారట.
