రోజురోజుకి చంద్రబాబు ఇంటిపై హైడ్రామా నడుస్తుంది.ఇప్పటికే కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో చంద్రబాబు నివాసం కూడా ఉంది.టీడీపీ ఎమ్మెల్యే అచ్చేయనాయుడు చంద్రబాబు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని దీనిని తొలిగించకూడదని చెప్పుకొచ్చారు.దీనిపై స్పందించిన వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు సవాల్ విసిరాడు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడమని,కాదని మీరు నిరుపిస్తారా? అని సవాల్ విసిరాడు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన బొత్స వీలైనంత తొందరగా చంద్రబాబు ముందుగానే ఖాళీ చేయడం మంచిదని అన్నారు.కాదని మొండికేస్తే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పుకొచ్చారు.