ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 2,3 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు.ఈ విషయాన్నీ చంద్రబాబు పీఏ మనోహర్ స్వయంగా ప్రకటించారు.రామకుప్పం, శాంతిపురం గుడుపల్లె, కుప్పం మండలాల్లో ఈ రెండురోజులు ఆయన పర్యటించనున్నారు.అయితే తాను నామినేషన్ కు రాకపోయినా నన్ను గెలిపించిన ప్రజలుకు దన్యవాదములు తెలపడానికి వస్తున్నట్టు సమాచారం.ఇది ఇలా ఉండగా ఆ నియోజకవర్గ ప్రజలు కొంతమంది కుప్పంకు ఏ మొఖం పెట్టుకొని వస్తావని ప్రశ్నిస్తున్నారు.ఒకవిధంగా చూసుకుంటే సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు పోటీ చేసిన స్థానం ఏకగ్రీవంగా ఎన్నికైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలాంటిది ఎన్నికల కౌంటింగ్ లో చంద్రబాబు మొదటి మూడు నాలుగు రౌండ్స్ లో వైసీపీ అభ్యర్ధి పై వెనకంజులో ఉన్నాడు.
దీనిబట్టి ఆలోచిస్తే చంద్రబాబు కు సొంత నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమవుతుంది.మరి ఇలాంటి సమయంలో బాబు పర్యటన ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్నగా మారింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో జగన్ చేస్తున్న పాలనకు యావత్ రాష్ట్ర పండగ చేసుకుంటున్నారు.ఇదే కంటిన్యూ అయితే చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గంలో కూడా గెలుపు కష్టమే అని చెప్పాలి.పేరుకే అక్కడ చంద్రబాబు గెలిచాడు తప్పా ప్రజలు మొత్తం జగన్ వెనుకే ఉన్నారని తెలుస్తుంది.మరి ఇలాంటి సమయంలో బాబు ఏమీ చేస్తాడు అనేది వేచి చూడాల్సిందే.