మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. తాజాగా టీడీపీకి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరగా.. తాజాగా పామర్రు సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణ బాబు పార్టీకి గుడ్‌బై చెప్పారు. రెండు రోజుల క్రితం ఆయన భార్యతో కలిసి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
