మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. ఇటీవలనే నలుగురు ఎంపీలు భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరే అవకాశం ఉనట్లు తెగ ప్రచారం జరుగుతుంది. ధర్మవరంలోని తన కార్యాలయంలో సూరి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో భేటీ అయినట్లు తెలుస్తుంది. టీడీపీకి రాజీనామా చేస్తూ లేఖను సూరి చంద్రబాబుకు లేఖ పంపినట్టు చెబుతున్నారు. కానీ, ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చేనెల మొదటి వారంలో సూరి బీజేపీలో చేరుతున్నట్లు సమచారం. అంతేకాదు అనంతపురం జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే వరదాపురం సూరి పార్టీ మారితే తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలతో చంద్రబాబు ఫోన్ లో చర్చించినట్టుగా సమాచారం
