ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రానికి అన్ని మంచిరోజులే వస్తున్నాయని ప్రజలు ఆనందంలో మునిగిపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుండి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే.అటు ప్రజలకు మంచి చేస్తూ ఇటు అక్రమాలకూ,అన్యాయాలకు పాల్పడుతున్న వ్యక్తులకు తాట తీస్తున్నాడు.ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలు అంతా ఇంతా కాదు.ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్రజలను నట్టేట ముచ్చేసారు.అక్రమ కట్టడాలు నిర్మించి కొన్ని వేల కోట్లు నొక్కేసారు.ఈ అక్రమాలను ఎండగట్టాలని జగన్ పూనుకున్నాడు.అయితే దీనిపై స్పందించిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
కరకట్ట నివాసం అక్రమ నిర్మాణమని చంద్రబాబుకు ముందే తెలిసినా అమాయకత్వంగా నటిస్తున్నారని, ఇన్నాళ్లు ప్రభుత్వం ఆ ఇంటికి అద్దె చెల్లించిందని అద్దె ఇల్లు ఖాళీ చేయడానికి అభ్యంతరం ఏముంటుంది?ప్రశ్నించారు ‘చెయ్యను పో’ అంటే ఇన్‌సైడర్ ట్రేడింగులో భాగంగానే లింగమనేని దాన్ని రాసిచ్చినట్టు అనుకోవాలి అని అన్నారు.చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగంనేని ఎస్టేట్ నుంచి తక్షణం ఖాళీ చేయాలి. అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కట్టారుగా అనే ముర్ఖపు లాజిక్కులతో తప్పించుకోలేరని, నదీ గర్భంలో నిర్మించిన భవనమని తేలాక కూల్చివేయడం తప్ప వేరే పరిష్కారమేముండదు అని విజయసాయి రెడ్డి అన్నారు.40ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న మీరు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు అని ఎద్దేవా చేసారు.
కరకట్ట నివాసం అక్రమ నిర్మాణమని చంద్రబాబుకు ముందే తెలిసినా అమాయకత్వం నటిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వం ఆ ఇంటికి అద్దె చెల్లించింది. అద్దె ఇల్లు ఖాళీ చేయడానికి అభ్యంతరం ఏముంటుంది? 'చెయ్యను పో' అంటే ఇన్‌సైడర్ ట్రేడింగులో భాగంగానే లింగమనేని దాన్ని రాసిచ్చినట్టు అనుకోవాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 27, 2019
చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగంనేని ఎస్టేట్ నుంచి తక్షణం ఖాళీ చేయాలి. అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కట్టారుగా అనే ముర్ఖపు లాజిక్కులతో తప్పించుకోలేరు. నదీ గర్భంలో నిర్మించిన భవనమని తేలాక కూల్చివేయడం తప్ప వేరే పరిష్కారమేముండదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 27, 2019