ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును కరకట్ట మీద నుండి ఖాళీ చేయించాలని భావించారు. దీనికి అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. ముందుగా చంద్రబాబు తన హాయంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చేసేలా ఆదేశాలిచ్చారు. అధికారులు చంద్రబాబు కళ్ల ముందే కూల్చేసారు. చంద్రబాబు కంటి ముందే తాను నిర్మించుకున్న భవనం నేల మట్టమైంది. ఇక, చంద్రబాబు ఇంటి గురించి జగన్ ఆలోచన చేస్తున్నారని..నిబంధనలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఆ నివాసం లో ఉంటున్నారంటూ ఒక రకంగా చంద్రబాబు ఆత్మరక్షణలో పడేసాలా చేసారు. దీంతో..గౌరవంగా తానే తన నివాసాన్ని ఖాళీ చేస్తే మంచిదనే అభిప్రాయానికి బాబు వచ్చారు. అంతే కొత్త నివాసం ఖరారు చేసారు. నాలుగు రోజుల్లోగా ఆయన తన కొత్త నివాసానికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఇప్పుడు కరకట్టలో ముఖ్య వ్యక్తిగా ఉన్న చంద్రబాబును ఖాళీ చేయించే పరిస్థితి తీసుకురావటం ద్వారా..మిగిలిన టీడీపీ నేతలకు సైతం పరోక్షంగా హెచ్చిరిక జారీ చేసినట్లుగా కనిపిస్తోంది. దీంతో జగన్ ఒక్క దెబ్బతో టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడాని సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే రెవిన్యూ అధికారుల నుండి నోటీసులు అందుకున్న వారికి మరో సారి నోటీసులు జారీ చేయాలనేది జగన్ తాజా నిర్ణయంగా తెలుస్తోంది. జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా అమలు చేస్తారనే విషయం మరో సారి రుజువైందని తెలుస్తుంది.
