సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు, అన్న చేయలేకపోయినా తమ్ముడు నమ్మకంగా చేస్తానంటున్నాడు, సీట్లు రాకపోయినా ఓట్లు చాలు పాతికేళ్ల పాటు రాజకీయ ప్రస్థానాన్ని కొసాగిస్తానన్నాడు.. ఇలాంటి ఓ సింపతీ పవన్ కల్యాణ్ పై కొంతమంది ప్రజల్లో ఉండేది. రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ ని చూసి తటస్థుల్లో జాలి, జనసైనికుల్లో ఆగ్రహం రెండూ సమపాళ్లలో కనిపించేవి. కానీ క్రమక్రమంగా ఆ సింపతీ పోతోంది, అందర్లో పవన్ అంటే అసహనం, కోపం పెరిగిపోతోంది. ఎందుకో తెలుసా ఏపీకి ప్రత్యేక హోదా విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకున్న పట్టుదల..ఆకాంక్ష ఆంధ్రా ప్రజలకు లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాలపాటు పోరాడితే.. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రజలు అంతటి ఆకాంక్షను చూపలేకపోయారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదిసార్లు మాటలు మార్చినా ప్రజల నుండి సరైన నిరసన రాలేదని పవన్ అన్నారు. ప్రజల నుండి బలమైన నిరసన రానంతవరకు హోదా విషయంలో తామేమీ చేయలేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హోదా సాధన విషయంలో ఆంధ్ర ప్రజలకు బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరూ ఏమీ చేయలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా మరోసారి ఇదే విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతోనే ప్రజావేదిక కూల్చివేస్తున్నట్టు పరోక్షంగా మాట్లాడారు పవన్. అక్రమ కట్టడాలు లేని ప్రదేశమే భారతదేశంలో లేదని, ప్రజావేదికను కూలుస్తున్నవారు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేయాలని ప్రభుత్వానికి ఉచిత సలహా పారేశారు . ప్రత్యేకహోదాపై ప్రజల దృష్టిలో చులకన అయ్యారు. ఇప్పుడు ప్రజావేదిక విషయంలో పవన్ చేసిన కామెంట్స్ మరోసారి అతడిపై చులకనభావం కలిగించేలా చేస్తున్నాయి. జగన్ చేసిన పనులకు మెచ్చుకోవాల్సింది పోయి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేయాలంటూ పవన్ అనడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బందిగా ఉందంటే ఏ అక్రమ కట్టడాన్నయినా కూల్చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని జగన్ కూడా ఐఏఎస్ ల మీటింగ్ లో చెప్పారు. కానీ ఈ అంశాల్ని ప్రస్తావించకుండా రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారు పవన్. అందుకే ప్రజల్లో తనపై ఉన్న కొద్దిపాటి సింపతీని కూడా కోల్పోతున్నారు.
Home / ANDHRAPRADESH / ఇక ఎప్పటికి పవన్ కల్యాణ్ ఏపీలో గెలవలేడు..ప్రజలను ఏం మాట్లాడినాడో చూడండి.. ఇంత చులకన
Tags ap special status comments controversial Pawan Kalyan prajavedika