ఎన్నికల ముందు వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో తెలిసిందే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఏపీలో చాల మంది నేతలు టీడీపీకి ‘గుడ్ బై’ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల్లే టీడీపీకి పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు. అయితే తాజాగా మరో నేత ,మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాను బీజేపీలో చేరినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబికా కృష్ణ సోదరుడు అంబికారాజా స్పష్టం చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరారని, తాను కూడా బీజేపీలో చేరినట్టు కథనాలు రావడంపై ఆయన మండిపడ్డారు. తాను హైదరాబాదులో ఉన్నానని, అంబికా కృష్ణతోపాటు బీజేపీలో చేరినట్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేసినట్లు తెలిసింది..దీంతో షాక్ అయ్యాను అన్నారు. తనకు దివంగత వైఎస్.రాజ శేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానమన్నారు. వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. త్వరలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని సమక్షంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యం లో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తాను వైసీపీలో ఎటువంటి పదవి ఆశించకుండా పార్టీలో చేరబోతున్నట్టు తెలిపారు.
