ఏపీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ కట్టి మరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలల్లో చేరుతున్న సంగతి తెల్సిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా మరో సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయోచనలో ఉన్నారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన టాలీవుడ్ ఇందస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత,సీనియర్ నేత పీవీవీపీ కృష్ణారావు ?(అంబికా కృష్ణ)టీడీపీని వీడెందుకు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీకెళ్ళిన అంబికా కృష్ణ బీజేకి చెందిన పలువురు నేతలతో భేటీలు జరుపుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి బాబు విదేశీ యాత్ర ముగిసేవరకు ఎంతమంది జంపింగ్ యాత్ర చేస్తారో..?
