నవ్యాంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కూమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. అమరావతిలో జరిగే సీఎం సమీక్ష సమావేశానికి ఉదయం నెల్లూరునుంచి బయలుదేరి వెళ్లారు అనిల్ కుమార్ యాదవ్. మార్గమధ్యంలో మేదర మెట్ల దగ్గర ఓ ప్రమాదం చూసి వెంటనే కాన్వాయ్ ని ఆపమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అంతలోనే 108 రావడంతో మంత్రి అనుచరులు క్షతగాత్రులను ఆ వాహనంలో ఎక్కించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో వారిని అక్కడినుంచి తరలించే వరకు మంత్రి అనిల్ అక్కడే ఉన్నారు.