నవ్యాంధ్ర ప్రదేశ్ కు కొత్త గవర్నర్ రానున్నారా..? ప్రస్తుతం ఉన్న ఈఎస్ఎల్ నరసింహాన్ ను తప్పించి వేరేవాళ్లకు నవ్యాంధ్రకు కొత్త గవర్నర్ గా కేంద్ర సర్కారు నియమించనున్నదా..? అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఈ క్రమంలో రాష్ట్రంలోని విజయవాడ ఎంజీరోడ్డులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ కార్యాలయంగా మారుస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జూలై ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్,త్రిపుర ,నాగాలాండ్,గుజరాత్ రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం ముగుస్తుంది.ఈ క్రమంలో ఈ రాష్ట్రాలతో పాటుగా ఏపీకి కొత్త గవర్నర్ ను కేంద్రం నియమించే అవకాశముంది.
