ఈ మాట కామెడీ గా అనిపించవచ్చు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్..కార్పొరేట్ వ్యవస్థ ఇప్పుడు దేశం లో ఒక పేర్లల్ గవర్నమెంట్.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలనే ఛాలెంజ్ చేసి ప్రభుత్వాలలో ఎవరు ఉండాలి అని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్న ఒక బలమైన వ్యవస్థకు ఎదురుగా జగన్ వెళ్తున్నాడు…ఈదేశం లో అతి పెద్ద వ్యాపారం విద్య,వైద్యం ఈ రెండు కార్పొరేట్ చేతిలో ఉన్న వ్యవస్థలు. వీటిలో తలదూర్చి జగన్ తట్టుకోగలడా!?ఈ వ్యాపారవేత్తలు ఈరోజుల్లో ఎంపీ లుగా కేంద్ర మంత్రులుగా ఉండి దేశ ఆర్థిక గతికి గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారన్నది అందరికి తెలిసిన పెద్ద సీక్రెట్… వాళ్ళకి ఎదురు తిరగడం అంటే ఎంత తెగింపు!?అమెరికా అధ్యక్షుడు అయిన జాన్ ఎఫ్ కెనడి లాంటి వాళ్లే కార్పొరేట్ కి ఎదురు తిరిగి నడిరోడ్డులో కాల్చివేయబడ్డాడు..
మోడీ లాంటి బలమైన నాయకుడే రిలయన్స్ అంబానీల చేతిలో చిక్కాడు. వాళ్ళని ఎం చేయలేక వాళ్ళు నిర్ణయించిన విదంగా చేసుకుంటూ వెళుతున్నాడు…కాంగ్రెస్ అధికారం లో ఉన్నా వాళ్ళు ఆడించిందే ఆట…ఈరోజు ప్రభుత్వ రంగ టెలికాం BSNL లో ఓనిచేసే ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంది అంటే కేవలం ఈ కార్పొరేట్ ఒత్తిళ్లే… చాలా మంది నమ్ముతున్నట్లు వైయస్సార్ లాంటి వ్యక్తే కార్పొరేట్ కి ఎదురు తిరిగి ప్రాణాలు కోల్పోయారు…. మరి జగన్ ఎందుకు ఇంత సాహసం చేస్తున్నట్లు!?
ఇవన్నీ జగన్ కి తెలియవా!? ఆలోచించి ఉండడా!? 45 ఏళ్ళకి 100 ఏళ్ల అనుభవం సంపాదించాడు.. ఒక ఏక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని ఉండడా!? ఎవరిని ఎలా అణిచివేయాలో తెలియదా!? మంచి చేయాలనే వచ్చాడు అనుకున్నా.. మొత్తం వ్యవస్థలనే మార్చాలి అనుకుంటున్నాడు అని క్లియర్ గా అర్థం అవుతుంది. మంచి చేస్తే వ్యక్తి ఉన్నన్నాల్లే.. వ్యవస్థలు మారితే తరతరాల కుళ్లు ని రాబోయే తరాలకు కనపడకుండా, అంటకుండా చేయగలగడమే…నేను ఒక అభిమానిగా జగన్ ఏది చేయగలడు అనుకున్నానో దానికి మించి చేయడం గర్వంగా ఉంది.. ఎప్పుడూ అభిమానినే ఇంకా పెరుగుతుంది..
Raja Sekhar Vatte పేరిట రాసిన పోస్టు వైరల్ అవుతుంది..