సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి తెల్ల కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి సరుకులన్నింటిని ప్యాకెట్ల రూపంలో మీ ఇంటికే వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో చర్చించడం జరిగింది.ప్రస్తుతం 50 కేజీల బస్తాల్లో రేషన్ బియ్యాన్ని రేషన్ షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.ఇలా చేయడం వల్ల బియ్యం అధిక మొత్తంలో పక్కకి మల్లిస్తున్నారు.ఇలాంటి అవినీతి, అక్రమాలను నిర్మూలించడానికి నూతన ప్రభుత్వం ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టనుంది.పౌరసరఫరాల శాఖ నుండి దీనికి సంభందించి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు బియ్యాన్ని 5, 10, 20 కేజీల ప్యాకెట్లుగా తయారు చేసి పంపిణీ చేయనుంది.
అయితే ఈ సంచులు పసుపు రంగుతో తయారుచేయడం పట్ల సీఎం కు వినతులు వినిపిస్తున్నాయి. సంచుల రంగులు మార్చండి సీఎం గారూ అంటూ వినతులు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ రంగులతో రైస్ ప్యాకెట్లు తయారు చేయడం చాలామందికి నచ్చడం లేదు. కారణం గత ప్రభుత్వ హయాంలో ప్రతీ వస్తువు, నిర్మాణం ఇలా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ అంశంలోనూ పసుపు రంగు కనిపించేది. ఇప్పుడు ప్రభుత్వం పాలన మారింది. ఈ దిశగా రంగులు కూడా మార్చాలంటూ సీఎంకు నెటిజన్లు సలహాలిస్తున్నారు. ఐదేళ్లుగా బాత్రూంల దగ్గరినుంచి, బడులు, గోడలు, కార్డులు, ఇలా అన్నీ పసుపుమయం చేసేసారు మీరైనా మార్చాలని కోరుకుంటున్నారు.