ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. అక్రమ కట్టడం అనేది తెలియచేయలన్న ఉద్దేశ్యంతోనే ఈ సదస్సు ప్రజావేదికలో ఏర్పాటు చేసినట్లు జగన్ వెల్లడించారు. ప్రజావేదికలో ఇదే ఆఖరి సమావేశం కావాలని, సమావేశం పూర్తయిన మరుసటి రోజే ఈ భవనాన్ని తొలగించాలని సీఎం జగన్ స్పష్టం చేసారు. జగన్ ఈ నిర్ణయం ప్రకటించగానే హర్షధ్వానాలుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అందరూ అభినందనలు తెలియచేసారు. అయితే గతంలో సీఎం చంద్రబాబు అధికారిక కార్యక్రమాలకు ఈ భవనాన్ని ఉపయోగించారు. ఆయన ఓడిపోయిన అనంతరం ప్రజావేదికను పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకుంటామని సీఎం కు లేఖ రాసారు. అయితే ప్రజావేదిక అక్రమ నిర్మాణం కావడంతో జగన్ దానిని కూల్చివేయాలని ఆదేశించారు.