తెలంగాణ కాంగ్రెస్‌కు వరుస షాక్‌ల పరంపర కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరగా…ఆ పార్టీలో అవకాశం లేనివారు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలో ఉన్న సీనియర్ నేతలే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆయా పార్టీల్లో సీనియర్స్‌గా ఉండి.. పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్‌గా లేని నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎవరు వచ్చినా డోర్స్ ఓపెన్ అన్న విధంగా తన ప్రణాళికను నడిపిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ఇది వరకే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న బీజేపీ.. అదే ఊపుతో ఇప్పుడు తెలంగాణపై కన్నేసింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోని సీనియర్ నేతలను టార్గెట్ చేసింది. ఇప్పటికే పలువురు నేతలతో జరిపిన చర్చలు సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. బీజేపీ హైకమాండ్‌తో టచ్‌లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడో, రేపో కాషాయ కండువాను కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో మంత్రులుగా పనిచేసిన బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలతో బీజేపీ సీనియర్స్ మంతనాలు జరిపినట్లు వార్తలు వచ్చాాయి. త్వరలో వారు పార్టీ మారనున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
అయితే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమని వచ్చిన వార్తలను సర్వే సత్యనారాయణ ఖండించారు. రాహుల్ ని ప్రధాని చేయడమే తన లక్ష్యమని చెప్పిన ఆయన.. కావాలనే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వదంతులను రేపుతున్నారని మండిపడ్డారు. తనను బీజేపీ నేతలు ఎవరూ సంప్రదించలేదని ఆయన తెలిపారు. అటు బలరాం నాయక్ కూడా తాను ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
See Also : వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…
See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.
See Also : బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేదనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
See Also : అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?
See Also : ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్