గత నెల మే 23 న ఎన్నిక ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే . ఆ రోజు నుండే ప్రభుత్వ అధికారులు మొత్తం వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖయ్యమంత్రి వైఎస్ జగన్ కి రీపోర్ట్ చెయ్యడం మొదలెట్టారు కాబట్టి 23 నే పాలన 30 రోజుల కింద లెక్కే మొట్టమొదటి ఆదేశం …
23 న 10 గంటలకే దాదాపు 100 చోట్ల లీడ్ వచ్చింది. ఇక ప్రభుత్వం మనదే అనే నమ్మకం వచ్చింది. ఎక్కడైతే గెలిచాం అన్న ఊపుతో లేదా గత 5 ఏళ్లగా సాగించిన కక్ష సాదింపు మీద తిరగబడతారు అన్న సందేహం ఉందో అక్కడ నాయకులకి స్వయంగా సీఎం జగన్ కి ఫోన్ చేసి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. ఏ చిన్న ఇన్ సిడెంట్ జరిగినా బాధ్యత మీదే అని చెప్పారు.
దీని వలనే దాదాపుగా ఎక్కడా కూడా కక్ష సాదింపు దాడులు జరగలేదు.
ఆలోచన ….
కచ్చితంగా ఇది తెలుగుదేశం కి జీర్ణించుకోలేని ఓటమి. కాబట్టి తెలుగుదేశం చేసిన తప్పులు చేయకూడదు. ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండాలి. ఆర్దిక దుబారా తగ్గించాలి. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలి . అభివృద్ది ని పరుగులు ఎత్తించాలి.పార్టీ ని సంస్థాగతంగా నిలబెట్టాలి. అవినీతి ని నిర్మూలించాలి.చాలా మంది ఈ విషయంలో అవహేళన చేశారు. కానీ సీఎం జగన్ ఆలోచనా విధానాం ఎప్పుడూ వేరు. 2014 ఎన్నికలు అయ్యాక అప్పటి జమ్మలమడగు శాసనసబ్యుడు అయిన ఆదినారాయణ రెడ్డి ఒక ప్రాపర్టీ అమ్మితే 40 కోట్లు వచ్చింది. మళ్ళీ ఏదో ప్రాపార్టీ కొంటా అంటే దానికి క్లీయర్ గా జగన్ … ఏదైనా ఒక చిన్న ఇండస్ట్రీ ప్లాన్ చెయ్యి, 10మందికి ఉపాది కల్పించు అన్నారు. ఇది ఆయన ఆలోచన విధానం…
ఇక టీం…
కోస్తా రాజకీయాలు చాలా వేరుగా ఉంటాయి. సీమ రాజకీయం వేరు. అందుకే స్పష్టంగా 2024 లో మళ్ళీ గెలవాలి అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చూపించాలి.దీనికి అనుగుణంగానే నిధులు సమకూర్చుకోవాలి.
జగన్ తో ఈ 10 ఏళ్ళు ఎవరైతే నడిచారో వాళ్ళకి పార్టీలో ఏ బాధ్యతలు ఇచ్చారో ప్రభుత్వంలో కూడా అవే బాధ్యతలు ఇచ్చారు. కేయన్ ఆర్ అప్పుడు పిఏ .. ఇప్పుడు కూడా అదే ఓఎస్డీ …. ఇప్పుడు అదే తలశిల రఘురాం … అప్పుడూ ప్రోగ్రాం ఇంచార్జ్ .. ఇప్పుడు అదే జీవీడి …. అదే బాద్యతసాయి రెడ్డి… అప్పుడు డిల్లీ బాధ్యతలే .. ఇప్పుడూ అవే అజయ్ కల్లం & శామ్యూల్ … గత ఏడాదిగా జగన్ కోసం లేదా చంద్రబాబు దుష్ట పరిపాలన అంతమొందించడానికి చేసిన పనులు .. ఇప్పుడూ వారు గతంలో ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఏమి చేశారో ఇప్పుడూ అదే పనులు… వైవి సుబ్బారెడ్డి …. అప్పుడు పార్టీ లో అంతర్గత బాధ్యతలు ఇప్పుడు టిటిడి ..
అధికారులు…. దాదాపు 150 పైగా IAS /IPS లను నియమించినా 99 % అధికారుల నియామకాల మీద ఆరోపణలు లేవు.
సరైన అధికారి సరైన పోస్ట్ లోకి వచ్చారు అనేది గట్టిగా ఆడ్మినీష్టేషన్ లోకి వెళ్లింది.ఇప్పటి వరకు వ్యవస్థ ని నడిపించే నియమాకాలు దాదాపుగా పూర్తి అయ్యాయి.కమ్యూనికేషన్ … జగన్ ఏమి చెయ్యాలి అనేది స్పష్టంగా తన చేతల ద్వారా చెబుతున్నాడు. దానికి ఉధాహారణే CMO లో నవరత్నాల రైతులు & నవరత్నాల అమలు కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ. ఇప్పటి వరకు Orientation phase అయిపోయింది … ఇక execution phase మొదలు కాబోతుంది. దీనికి అనుగుణంగానే రేపటి నుండి రెండు రోజుల పాటు కలక్టర్ల మీటింగ్.
మా అంచనా ప్రకారం రేపు ఎల్లుండ జరగబోయే మీటింగ్ లో జగన్ ఈ 5 ఏళ్లలో ఏమి చెయ్యాలి అనుకున్నాడు అనేది స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. అధికార యంత్రాంగానికి ఒక దశా దిశ ఈ మీటింగ్ లో వస్తుంది. దీని తర్వాత బడ్జెట్ ని వచ్చే నెల 10 న ప్రవేశపెట్టే ఆలోచన ఉంది ప్రభుత్వం.
See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.
See Also : వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…
See Also : బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేదనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
See Also : అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?
See Also : ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్