తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి పరంపరల్లో మరో అంశం తెరమీదకు వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో…అందినకాడికి దోచుకున్న బాబు తీరు మళ్లీ బట్టబయలు అయింది. ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందని ‘సీఆర్‌డీఏ’ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక నిర్మాణానికి సంబంధించిన వివరాలపై ప్రభుత్వం సూచన మేరకు సీఆర్‌డీఏ నివేదిక ఇచ్చింది. మున్సిపల్, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీఆర్‌డీఏ అధికారులు నివేదిక అందజేశారు
ఉండవల్లిలో కరకట్టను ఆనుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసం ఉండటం తెలిసిందే. ఆయన నివాసం పక్కన దాదాపు 4.5 కోట్ల రూపాయల వ్యయంతో గతంలో ప్రజావేదికను సీఆర్‌డీఏ అధికారులు నిర్మించారు. తమ అనుమతి లేకుండానే నిర్మాణం జరిపినట్టు ఆ నివేదికలో సీఆర్‌డీఏ స్పష్టం చేసింది. అంచనాలను తారుమారు చేసినట్టు నివేదికలో వెల్లడించిన సీఆర్‌డీఏ.. రూ. 5 కోట్ల అంచనాలను 8.90 కోట్ల మార్చేసినట్టు పేర్కొంది. కృష్ణానది కరకట్టలో నిర్మాణానికి అనుమతి నిరాకరించినట్లు ఆ నివేదికలో పేర్కొన్న సీఆర్‌డీఏ.. అప్పటి మంత్రి నారాయణ నోటి మాటతో టెండర్లు లేకుండానే పనులు అప్పగించినట్లు తేల్చింది.
ఇదిలాఉండగా, రాష్ట్ర అధికార పగ్గాలను వైకాపా చేపట్టాక, ప్రతిపక్ష నేత హోదాలో తన కార్యాలయం కింద ప్రజావేదికను కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై శాసన మండలిలో వైకాపా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ప్రజావేదిక అంశాన్ని ప్రస్తావించారు. అది రివర్ కన్జర్వేషన్ జోన్ పరిధిలో ఉందని, అందువల్ల ఆ భవనాన్ని ఇతరులకు కేటాయించడం ఆక్రమణలను ప్రోత్సహించినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజావేదికను చంద్రబాబుకు కేటాయించకుండా, ప్రభుత్వం శుక్రవారం స్వాధీనం చేసుకుంది.
See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.
See Also : వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…
See Also : బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేదనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
See Also : అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?
See Also : ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్