2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ… తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడ పనిచేశారు అఖిలప్రియ… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో అటు ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన అఖిలప్రియ, ఇటు నంద్యాల నుంచి పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ ఓటమి చెందారు. దీంతో తిరిగి సొంత గూటికి మంత్రి అఖిలప్రియ ప్రయత్రిస్తున్నట్లు తెలుస్తుంది. కన్ఫాం చేసిన ఫోన్ కాల్..!! అవును, భూమా అఖిల ప్రియ తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పార్టీ వైసీపీలోకి తిరిగి రానున్నారు. ఈ వార్తను ఇప్పుడు అటు టీడీపీ వర్గాలతోపాటు ఇటు వైసీపీ వర్గాలు కన్ఫాం చేశాయి. ఇందుకోసం కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, భూమా అఖిలప్రియ మామ ఎస్వీ మోహన్ రెడ్డికి ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మామ నేను వైసీపీలోకి చేరాలని అనుకుంటున్న..నీవు ఎలాగో ఎన్నికల సమయంలో వైసీపీలోకి చేరిపోయావు..నేను కూడ నీతో పాటు జగన్ అన్నతో ఉంటే నాకు మంచి జరిగిదే..ఇప్పుడు టీడీపీలో ఉంటున్నా, టీడీపీ పార్టీ నేతలే నాపై కుట్ర పన్నుతున్నారు, నన్ను రాజకీయంగా దెబ్బ తీయడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారని మామ ఎస్వీ మోహన్ రెడ్డితో చెప్పినట్లు సోషల్ మీడియాలో ఫోన్ కాల్ ఆడియో ఇదే అంటూ హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భూమా అఖిలప్రియ మళ్లీ ఆ పార్టీలోకి వస్తారా లేదో చూడాలి మరి.