వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కు పసికూన అఫ్గనిస్థాన్ దిమ్మదిరిగే షాకిచ్చింది.ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. ఈ క్రమంలో ఒక్కో పరుగు తీసేందుకు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది.
ఒకానొక దశలో వికెట్ కాపాడుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆరంభంలో విరాట్ కోహ్లీ(67: 63 బంతుల్లో 5ఫోర్లు).. ఆఖర్లో కేదార్ జాదవ్(52: 68 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ 8 వికెట్లకు 224 పరుగులు చేసింది.
లోకేష్ రాహుల్(30), విజయ్ శంకర్(29), మహేంద్రసింగ్(28) చెప్పుకోదగ్గ స్థాయిలో పోరాడారు. ఓపెనర్ రోహిత్ శర్మ(1) మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వికెట్ పోగొట్టుకున్నాడు. హార్డిక్ పాండ్య(7), షమీ(1), కుల్దీప్ యాదవ్(1 నాటౌట్), బుమ్రా(1 నాటౌట్)లను అఫ్గాన్ బౌలర్లు కట్టడి చేశారు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్(2 51), మహ్మద్ నబీ(2/33), ముజీబ్ రెహ్మన్(1/26), రషీద్ ఖాన్(1/38) గొప్పగా బౌలింగ్ చేశారు.
See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.
See Also : బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేదనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
See Also : అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?
See Also : ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్