తాజాగా టీడీపీ సోషల్ మీడియా ఓ ఫొటోతో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారంలో నిప్పు.. ఉప్పులా ఉండే విజయసాయి, సీఎం రమేష్ ఇద్దరు నేతలు ఒక దగ్గర చేరారు.. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. తొలుత సీఎం రమేశ్ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకొని కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు. తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్ పక్కన కూర్చొన్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ మాట్లాడుతూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ వచ్చినా ఆయన వారిద్దరికీ కొంతదూరంలో కూర్చుండిపోయారు. ఆ తర్వాత కూడా సీఎం రమేశ్, విజయసాయిరెడ్డిలు చర్చల్లో మునిగిపోయారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లడంతో టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరు బీజేపీలోకి వెళ్లడంతో టీడీపీ ఖాళీ అయ్యిందని కొందరు అభిప్రాయపడుతుంటే చంద్రబాబే బీజేపీలోకి పంపించారనే వాదనలు కూడా వినిపించాయి.
విజయసాయి రెడ్డి కూడా ఇదంతా చంద్రబాబు పథకం ప్రకారం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో కలిసి విజయసాయి రెడ్డి భోజనం చేస్తున్న ఫోటోలు మరోసారి వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై టీడీపీ అభిమానులు బీజేపీలో చేరికల వ్యవహారాన్ని విజయసాయిరెడ్డే పర్యవేక్షిస్తున్నారంటూ చర్చిస్తున్నారు. సందర్భంగా విజయసాయిరెడ్డి, సీఎం రమేష్‌లు పక్కపక్కనే కూర్చున్నారు. గతంలో ఉప్పు, నిప్పులా ఉన్న ఇద్దరూ రెండు గంటలకుపైగా లోక్‌సభలోనే చర్చించుకున్నారు. తమ మిత్రపక్షం బీజేపీని బలోపేతం చేసి టీడీపీని దెబ్బతీసే ఎత్తుగడను విజయసాయి అమలు చేస్తున్నారంటూ టీడీపీ అభిమానులు విమర్శిస్తున్నారు. వీరు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి విజయసాయి రెడ్డే కారణమని, టీడీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు అంటే చివరికి టీడీపీ రాజ్యసభాపక్షం విలీనాన్ని విజయసాయిరెడ్డే డిసైడ్ చేసారనే వారే ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.